JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌.. భారీగా ఆస్తుల అటాచ్‌

*రూ.22.10 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ

Jyothi
Updated on: 30 Nov 2022 1:15 PM IST
ED Attaches Rs 22. 10 Crore Property Of Jc Prabhakar Reddy
X

JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌.. భారీగా ఆస్తుల అటాచ్‌

JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ షాక్‌ ఇచ్చింది. బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్‌లో అవకతవకలు జరిగాయన్న ఈడీ.. 22 కోట్ల 10 లక్షలు విలువైన జేసీ కంపెనీ ఆస్తులను అటాచ్‌ చేసింది. జేసీ అనుచరుడు గోపాల్‌రెడ్డి ఆస్తులను కూడా అటాచ్ చేసింది ఈడీ. వీటిలో దివాకర్‌ రోడ్‌లైన్స్‌, జటధా ఇండస్ట్రీస్‌, సి.గోపాల్‌ రెడ్డి అండ్‌ కో ఆస్తులు కూడా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా బీఎస్‌-4 వాహనాల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఝటధార ఇండస్ట్రీస్‌, గోపాల్‌ రెడ్డి అండ్‌ కో కంపెనీలు అశోక్‌లేలాండ్‌ నుంచి తక్కువ ధరకే బీఎస్‌-4 వాహనాలను కొనుగోలు చేశాయి. నాగాలాండ్‌, కర్ణాటక, ఏపీలో తప్పుడు ధ్రువపత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించాయి. రూ.38.36 కోట్ల లావాదేవీలు అక్రమంగా జరిగినట్లు గుర్తించాం అని ఈడీ పేర్కొంది.

Jyothi

Jyothi

Next Story