EAPCET Results: EAPCET ఫలితాలు విడుదల

EAPCET Results: ఫలితాలు విడుదల చేసిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

Sandeep Eggoju
Published on: 8 Sept 2021 1:32 PM IST
EAPCET Results are Released by Minister Adimulapu Suresh
X

ఆదిమూలపు సురేష్ (ఫోటో ది హన్స్ ఇండియా)

EAPCET Results: ఈఏపీసెట్ ఇంజినీరింగ్ ఫలితాలను విడుదల చేశారు మంత్రి ఆదిమూలపు సురేష్. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 66వేల 460 మంది పరీక్షలకు హాజరు కాగా.. లక్షా 33వేల మంది విద్యార్థులకు పైగా ఉత్తీర్ణత సాధించారని స్పష్టం చేశారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో 80.62 శాతం విద్యార్థులు అర్హత సాధించారని, గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం పెరిగిందన్నారు. ఈ నెల 14న అగ్రికల్చర్‌, ఫార్మసీ ఫలితాలు విడుదల చేస్తున్నట్టు చెప్పారు. ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌లో మొదటి ర్యాంక్‌ అనంతపురానికి చెందిన నిఖిల్‌ సాధించగా శ్రీకాకుళం విద్యార్థి మహంత్‌ నాయుడు రెండో ర్యాంక్‌, కడపకు చెందిన దుగ్గినేని వెంకట రాజేష్‌ థర్డ్‌ ర్యాంక్‌ సాధించినట్టు వెల్లడించారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story