EAMCET online mock test in Andhra Pradesh: ఈ నెల 19న ఏపీలో ఆన్లైన్ మాక్ ఎంసెట్!

EAMCET online mock test in Andhra Pradesh: ఈ నెల 19న ఏపీలో ఆన్లైన్ మాక్ ఎంసెట్!
x
Highlights

EAMCET online mock test in Andhra Pradesh: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు చాలావరకు ఎగ్జామ్స్ ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

EAMCET online mock test in Andhra Pradesh: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటివరకు చాలావరకు ఎగ్జామ్స్ ను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం ఎంసెట్ ను పగడ్భందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే దీనికి సంబంధించి ముందుగా ప్రభుత్వ ఆద్వర్యంలోనే ఆన్లైన్ మాక్ టెస్ట్ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నెల 19న ఈ టెస్ట్ నిర్వహించి, మరుసటి రోజే ఫలితాలు వెల్లడి చేసేలా ఏర్పాట్లు చేస్తోంది.

ఎంసెట్ పరీక్షలో భాగంగా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఆన్‌లైన్‌లో ఉచిత ఎంసెట్ మాక్ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. ఈ మేరకు సోమవారం మాక్‌ టెస్ట్‌ వివరాలకు సంబంధించిన పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. కంప్యూటర్ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ ఈ నెల 19న మాక్‌ టెస్ట్‌ను నిర్వహిస్తుందన్నారు. ఎంసెట్‌ మాదిరిగానే ఈ పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తారన్నారు.

మరుసటి రోజున ఫలితాలు వెల్లడిస్తారన్నారు. ఫలితాలతో పాటు విద్యార్థులు ఏ ఏ అంశాలలో ఎక్కువ కృషి చేయాలో తెలుపుతారన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎంసెట్ మాక్ పరీక్షలో పాల్గొనదలచిన విద్యార్ధులు www.csihyderabad.org/eamcet లేదా www.eamcet.xplore.co.in లలో ఈ నెల 18వ తారీఖు లోగా నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories