వివాదాస్పదమైన ద్వారక తిరుమల ఏఈవో రామాచారి మృతి

* ఈవో వేధింపులతోనే రామాచారి మనస్థాపానికి గురైనట్లు ఆరోపణ * స్వామివారి పాదాల మండపం వద్ద ఆలయ ఉద్యోగుల ఆందోళన

Sandeep Reddy
Published on: 13 Aug 2021 12:08 PM IST
Dwaraka Tirumala AEO Ramachari Self Distracted is Alleged That Was Mentally Disturbed by The EO Harassment
X

Andhra Pradesh: పశ్చిమగోదావరి జిల్లా ద్వారక తిరుమల చిన్న వెంకన్న ఆలయ ఏఈవో రామాచారి మృతి వివాదాస్పదమైంది. ఏఈవో రామాచారి తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఆయన మరణవార్త తెలుసుకున్న ఆలయ ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఏఈవో మరణానికి ఆలయ ఈవో జీవీ సుబ్బారెడ్డి వేధింపులే కారణమని ఆరోపించారు. ఈవో డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. స్వామివారి పాదాల మండపం వద్ద నల్లబ్యాడ్జీలు ధరించి నేలపై కూర్చొని నిరసన చేపట్టారు. రామాచారిని ఈవో వ్యక్తిగతంగా దూషించారని, అందుకే ఆయన మనస్తాపంతో చనిపోయినట్లు ఆరోపిస్తున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story