శ్రీశైలంలో డ్రోన్ కలకలం

* డ్రోన్‌ను పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది

R Tripura Malini
Published on: 18 Dec 2022 6:30 AM IST
Drone Commotion In Srisailam
X

శ్రీశైలంలో డ్రోన్ కలకలం 

Srisailam: శ్రీశైలంలో డ్రోన్ కలకలం రేపింది. ఆలయ సమీపంలోని బస్టాండు బలిజ సత్రం పరిసరాలలో ఆకాశంలో డ్రోన్ ఎగురుతున్న దృశ్యాన్ని దేవస్దానం సెక్యూరిటీ సిబ్బంది గమనించారు. డ్రోన్ కెమారా ఎక్కడ నుంచి ఎగురుతుందోనని డ్రోన్ కిందకు దిగేంత వరకు డ్రోన్ ను వెంబడించారు. శ్రీశైలంలోని బస్టాండు సమీపంలో డ్రోన్ ఎగురుతూ బలిజ సత్రం వైపు డ్రోన్ వెల్లింది. డ్రోన్ ను గమనించిన సెక్యూరిటీ దాని వెంట చూస్తూ వెళ్లారు. బలిజ సత్రంపైన డ్రోన్ ను గుర్తు తెలియని వ్యక్తులు దించారు.

దేవస్దానం సెక్యూరిటీ సిబ్బంది డ్రోన్ ను చాకచక్యంగా వెంబడించి డ్రోన్ ను ఎగురవేసిన వ్యక్తులను పట్టుకున్నారు. దేవస్దానం పరిధిలో డ్రోన్ ఎగురవేయాలంటే అధికారుల అనుమతి ఉండాలి. అయితే వారి వద్ద ఎటువంటి అనుమతి లేకపోవడంతో శ్రీశైలం దేవస్దానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ కు సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. అనుమతి లేకుండా శ్రీశైలంలో ఎగురుతున్న డ్రోన్ కెమరాను సెక్యూరిటీ సిబ్బంది స్వాధీనం చేసుకుని ఉన్నతాధికారులకు అప్ప చెప్పారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story