ఏపీలో 'డ్రీమ్ 11 బ్యాన్' : లబోదిబోమంటున్న ఫ్యాన్స్

ఏపీలో డ్రీమ్ 11 బ్యాన్ : లబోదిబోమంటున్న ఫ్యాన్స్
x
Highlights

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే ఆన్ లైన్ జూదాన్ని నిషేధించిన రాష్ట్రా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే ఆన్ లైన్ జూదాన్ని నిషేధించిన రాష్ట్రా ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ సీజన్ కావడంతో డ్రీమ్ 11‌ లో దేశవ్యాపత్తంగా ఫ్యాన్స్ డబ్బులతో క్రికెట్ ఆడుతున్నారు. ఈ క్రమంలో డ్రీమ్ 11‌ని బ్యాన్ చేసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. డ్రీమ్ 11‌ యాప్‌ని ఓపెన్ చేస్తే బ్యాన్ అని చూపిస్తోందని.. కొంతమంది సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పోస్ట్ చేస్తున్నారు. దీంతో డ్రీమ్ 11 ఫ్యాన్స్ లబోదిబోమంటున్నారు. తమ డబ్బులు ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇదిలాఉంటే ఓ వ్యక్తి తన డబ్బు గురించి ప్రశ్నిస్తూ చేసిన ట్వీట్‌కు డ్రీమ్ 11 స్పందించింది.

డబ్బులు వాలెట్‌లో జాగ్రత్తగా ఉంటాయని.. వివరాలకోసం http://d11.co.in/HelpCenter ను సంప్రదించి ఫిర్యాదు చేస్తే.. డబ్బులు తిరిగి చెల్లిస్తామని క్లారిటీ ఇచ్చింది. దీంతో ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు డ్రీమ్ 11‌ని బ్యాన్ చేశారని తెలియడంతో అందరూ ముందు జాగ్రత్తగా డబ్బుల్ని డ్రా చేసుకుంటున్నారు. కాగా డ్రీమ్ 11 యాప్‌ ను తెలంగాణ, ఒడిశా,అసోం, నాగాలాండ్‌ ప్రభుత్వాలు ఇప్పటికే నిషేధించిన సంగతి తెలిసిందే. ఆన్ లైన్లో పేకాట రమ్మీ, పోకర్ లాంటి జూడ క్రీడలను నిషేధిస్తూ ఇటీవల ఏపీ కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories