జగన్‌ పర్యటన.. నర్సీపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌ ఫొటోతో ఫ్లెక్సీలు

Narsipatnam: విశాఖలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ ఉదంతం తెరపైకి వచ్చింది.

Arun Chilukuri
Published on: 9 Oct 2025 11:10 AM IST
జగన్‌ పర్యటన.. నర్సీపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌ ఫొటోతో ఫ్లెక్సీలు
X

జగన్‌ పర్యటన.. నర్సీపట్నంలో డాక్టర్‌ సుధాకర్‌ ఫొటోతో ఫ్లెక్సీలు

Narsipatnam: విశాఖలో మాజీ సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో డాక్టర్ సుధాకర్ ఉదంతం తెరపైకి వచ్చింది. నర్సీపట్నంలో రాత్రికి రాత్రి డాక్టర్ సుధాకర్ పేరిట భారీ హోర్డింగ్స్ వెలిశాయి. 2020లో కోవిడ్ సమయంలో ఏరియా ఆసుపత్రిలో పని చేసే డాక్టర్ సుధాకర్.. మాస్కులు ఇవ్వలేదని ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

దీంతో ప్రభుత్వం ఆయనను సస్పెండ్ చేసింది. మాస్కులు ఇవ్వలేక హత్యలు చేసిన వారు.. ఇప్పుడు మెడికల్ కాలేజీల కోసం మాట్లాడతారా..? ప్రజలు తస్మాత్ జాగ్రత్త అనే హోర్డింగ్స్‌ ఇప్పుడు విశాఖలో హాట్‌టాపిక్‌గా మారాయి.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story