ఒకే ఈతలో 18 పిల్లలకు జన్మనిచ్చిన శునకం

ఒకే ఈతలో 18 పిల్లలకు జన్మనిచ్చిన శునకం
x
Highlights

ఒకే కాన్పులో 18 పిల్లలకు జన్మనిచ్చింది ఓ శునకం. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామానికి చెందిన శరవణ్‌ మిర్చి కోల్డ్‌ స్టోరేజీ యజమాని...

ఒకే కాన్పులో 18 పిల్లలకు జన్మనిచ్చింది ఓ శునకం. గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం లగడపాడు గ్రామానికి చెందిన శరవణ్‌ మిర్చి కోల్డ్‌ స్టోరేజీ యజమాని సైదారావు, గ్రేట్ డాని బ్రీడ్ కు చెందిన ఓ కుక్కను పెంచుకుంటున్నారు. సైదారవు శునకాన్ని రూ.30 వేలకు బెంగళూలూరు లో కొనుగోలు చేసి తెచ్చి స్వీటీ అని పేరు పెట్టుకుని పెంచుకుంటున్నారు.

ఇది మొదటి ఏడు పది పిల్లలకు, రెండు ఏడు 18పిల్లలకు జన్మనిచ్చిందని యజమాని తెలిపారు. 18 కుక్క పిల్లల్లో 11 మగవి కాగా 7 ఆడ పిల్లలు. మొత్తం 18 పిల్లలు ఆరోగ్యంగానే ఉన్నాయి. వీటిని చూసేందుకు స్థానికులు లైన్ కట్టారు. యుఎస్‌ లో 2014లో ఇదే జాతికి చెందిన శునకం 19 పిల్లలకు జన్మనిచ్చి ప్రపంచ రికార్డు సాధించిందన్నారు. ఒకే ఈతలో 18 పిల్లలు పుట్టడం చాలా అరుదని, సూపర్‌ ఓవలేషన్‌ కారణంగా ఇలా జరుగుతుందని పెదకూరపాడు మండల పశు వైద్యాధికారి కోమటినేని రాఘవయ్య పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories