DJ Sound: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దారుణం.. డీజే సౌండ్‌కి గోడ కూలి పలువురికి గాయాలు

DJ Sound: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. డీజే సౌండ్‌కి గోడ కూలి పలువురికి గాయాలయ్యాయి.

Arun Chilukuri
Published on: 16 Oct 2025 12:27 PM IST
DJ Sound: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దారుణం.. డీజే సౌండ్‌కి గోడ కూలి పలువురికి గాయాలు
X

DJ Sound: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దారుణం.. డీజే సౌండ్‌కి గోడ కూలి పలువురికి గాయాలు

DJ Sound: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో దారుణం చోటుచేసుకుంది. డీజే సౌండ్‌కి గోడ కూలి పలువురికి గాయాలయ్యాయి. మండలంలోని భవానీపురంలో రామ్ మందిరం దగ్గర నందన్న ఊరేగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అర్ధరాత్రి 12:30 గంటల వరకు డీజే వాహనం గోడ పక్కనే ఉండటంతో అంత భారీ సౌండ్‌కి ఈ ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు.

దీంతో అంత తీవ్ర స్థాయిలో డీజే సౌండ్స్ ఉన్నాయంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయినట్లు స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story