దివాకర్ ట్రావెల్స్‌కు ఆర్టీఏ అధికారుల షాక్..8 బస్సులు సీజ్‌..

దివాకర్ ట్రావెల్స్‌కు ఆర్టీఏ అధికారుల షాక్..8 బస్సులు సీజ్‌..
x
Highlights

నిబంధనలు పాటించకుండా బస్సులు నడుపుతున్న దివాకర్‌ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు దాడులు చేపట్టారు. రెండు రోజుల్లో ఏకంగా 8 బస్సులను సీజ్‌ చేశారు....

నిబంధనలు పాటించకుండా బస్సులు నడుపుతున్న దివాకర్‌ ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులు దాడులు చేపట్టారు. రెండు రోజుల్లో ఏకంగా 8 బస్సులను సీజ్‌ చేశారు. అనంతపురం జిల్లాలోని పలుచోట్ల తనిఖీలు చేపట్టిన అధికారులు గుంతకల్లు పరిధిలో 3 బస్సులు, అనంతపురంలో 4, పెనుకొండ చెక్‌పోస్ట్‌ దగ్గర ఒక బస్సును సీజ్‌ చేశారు. ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా బస్సులో అనుమతి తీసుకున్న దానికంటే అధికంగా సీట్లు, ఎక్కువమంది ప్రయాణీకులు, లైసెన్స్ లేకపోవడంతో బస్సులను సీజ్‌ చేసినట్లు అధికారులు వివరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories