Tirumala: టీటీడీ కీల‌క నిర్ణ‌యం.. దివ్యదర్శనం టోకెన్లు జారీ కేంద్రం మార్పు

Tirumala: భూదేవి కాంప్లెక్స్‌లో నేటి నుంచి టోకెన్లు జారీ

Jyothi
Updated on: 14 April 2023 9:45 AM IST
Divya Darshan Tokens Issuance Change In Tirupati
X

Tirumala: టీటీడీ కీల‌క నిర్ణ‌యం.. దివ్యదర్శనం టోకెన్లు జారీ కేంద్రం మార్పు

Tirumala: తిరుమల అలిపిరి నడక మార్గంలో కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ కేంద్రం మార్పు చేశారు... గాలి గోపురం వద్ద కాకుండా అలిపిరి భూదేవి కాంప్లెక్స్‌లో నేటి నుంచి కాలినడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు... టోకెన్లకు గాలిగోపురం 2,083వ మెట్టు వద్ద స్కానింగ్ తప్పనిసరి చేస్తారు.. స్కానింగ్ చేసుకుంటేనే దర్శనానికి అనుమతి ఇస్తారు. శ్రీవారి మెట్టు మార్గంలో యధావిధిగా టోకెన్లు జారీ చేస్తారు. ఇంతేకాదు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, గోవింద రాజసత్రాల్లో భక్తులకు SSD టోకెన్లు జారీ చేస్తున్నారు అధికారులు.

Jyothi

Jyothi

Next Story