Nellore: నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్‌ బీభత్సం

Nellore: నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. గత రాత్రి నుంచి నెల్లూరు తీరప్రాంతంలో కుంభవృష్టి కురుస్తోంది.

Arun Chilukuri
Published on: 3 Dec 2025 11:57 AM IST
Nellore: నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్‌ బీభత్సం
X

Nellore: నెల్లూరు జిల్లాలో దిత్వా తుఫాన్‌ బీభత్సం సృష్టించింది. గత రాత్రి నుంచి నెల్లూరు తీరప్రాంతంలో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో.. డ్రైన్లు, కాలువలు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వైఎస్సార్‌ నగర్‌, శ్రామికనగర్‌, ఆర్టీసీ కాలనీ, తల్పగిరి కాలనీలు నీటమునిగాయి. భారీ వర్షాలకు రోడ్లన్నీ దెబ్బతినడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

కొన్నిచోట్ల రోడ్లు కొట్టుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో నెల్లూరు రూరల్‌ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ కోటంరెడ్డి గిరిధర్‌రెడ్డి పర్యటించారు. బాధితులను ఆయన పరామర్శించారు. అన్నివిధాలా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. మరోవైపు.. తీర ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుండటంతో జిల్లా అధికారులు రంగంలోకి దిగారు. తీరప్రాంతంలో నివసిస్తున్నవారిని అప్రమత్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story