District Committee Ready to Report on Swarna Palace: జిల్లా కమిటీ నివేదికలు సిద్ధం

District Committee Ready to Report on Swarna Palace: జిల్లా కమిటీ నివేదికలు సిద్ధం
x
vijayawada
Highlights

District Committee Reports ready on Swarna Palace: స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి. ఫైర్, విద్యుత్, వైద్య మరియు భద్రతా కమిటీలు నివేదికలను సిద్ధం చేశాయి. ఈ రోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్‌కు కమిటీలు నివేదిక ఇవ్వనున్నాయి.

District Committee Ready to Report on Swarna Palace: విజ‌య‌వాడ‌లోని స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి. ఫైర్, విద్యుత్, వైద్య మరియు భద్రతా కమిటీలు నివేదికలను సిద్ధం చేశాయి. ఈ రోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్‌కు కమిటీలు నివేదిక ఇవ్వనున్నాయి.

నివేదికలో కీలకాంశాలు:-

* స్వర్ణా ప్యాలెస్‌ లో అగ్ని ‌ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇవ్వలేదని కమిటీ తేల్చి చెప్పింది.

* మంటలను చెలారేగిన వెంట‌నే ఫైర్ స్టేష‌న్ కు సమాచారమివ్వ కుండా, ఆల‌స్యంగా స‌మాచార‌మివ్వ‌డంతోనే భారీ ప్ర‌మాదం జ‌రిగింది.

* అగ్ని ప్రమాదం గుర్తించే కనీస పరికరాలు, స్మోక్ డిటెక్టర్, పని చేయని అలారం వల్లే అత్యధిక మంది మృతి.

* రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం. ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదని నిర్దారణ

* కోవిడ్ పేషేంట్స్ నుంచి డబ్బులు భారీగా వసూలు చేసినట్టు విచారణలో వెల్లడి

* అనుమతికి మించి పేషేంట్స్‌ను చేర్చుకున్నట్టు గుర్తింపు

* భద్రతా ప్రమాణాలు లేకపోయినా స్వర్ణా ప్యాలెస్‌లో కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటుకు అనుమతి.

* షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు చాలా తక్కువని, కలప, ఫైబర్‌తో చేసిన ఇంటీరియర్ డెకరేషన్‌కు సానిటైజేషన్ వాడకం ఎక్కువగా ఉండటం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని విద్యుత్ శాఖ కమిటీ నివేదిక.

Show Full Article
Print Article
Next Story
More Stories