Nadendla manohar: ఏపీలో సబ్సిడీపై నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

Nadendla manohar: 784 అవుట్ లెట్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తాం

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 11 July 2024 5:30 PM IST
Distribution program of essential goods on subsidy started in AP
X

Nadendla manohar: ఏపీలో సబ్సిడీపై నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమం ప్రారంభం

Nadendla manohar: విజయవాడలో సబ్సిడీపై నిత్యావసర సరకుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఈరోజు నుంచి 784 అవుట్ లెట్ల ద్వారా కందిపప్పు, బియ్యం తక్కువ ధరకు అందిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. రైతులకు, వినియోగదారులకి మేలు జరగాలనేదే తమ ఆకాంక్ష అన్నారు మంత్రి నాదెండ్ల. పౌర సరఫరాల కార్పొరేషన్ ద్వారా గత ప్రభుత్వం..36 వేల కోట్లు అప్పు తీసుకుందన్నారు. రైతులకు 1600 కోట్లు బకాయి పెట్టి వెళ్లారన్నారు. సీఎం, డిప్యూటీ సిఎం సహకారంతో వెయ్యి కోట్లు రైతులకు ఇచ్చాం, త్వరలో మరో ఆరు వందల కోట్లు ఇస్తామన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story