ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

distribution of YSR Pension Kanuka in Andhra Pradesh is underway
x

ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న పెన్షన్ల పంపిణీ

Highlights

ఏపీ వ్యాప్తంగా లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఇంటింటికి వెళ్లి లబ్దిదారుల చేతికే పెన్షన్ అందిస్తున్నారు వాలంటీర్లు. ఉదయం 11 గంటల వరకు...

ఏపీ వ్యాప్తంగా లబ్దిదారులకు పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది. ఇంటింటికి వెళ్లి లబ్దిదారుల చేతికే పెన్షన్ అందిస్తున్నారు వాలంటీర్లు. ఉదయం 11 గంటల వరకు 43.84 లక్షల మందికి పెన్షన్లు అందించారు. దీంతో మొత్తంగా 71.40శాతం మందికి పెన్షన్ల పంపిణీ పూర్తయినట్టు అధికారులు తెలిపారు. పెన్షనర్లకు మొత్తం వెయ్యి 42కోట్లు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 61.40 లక్షల మందికి పెన్షన్లు ఉండగా.. వారికోసం రూ.1478.83 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కాగా ప్రభుత్వం 2.66 లక్షల మంది వాలంటీర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ చేపట్టింది. బయోమెట్రిక్‌, ఐరిస్‌ విధానం ద్వారా లబ్ధిదారులకు పెన్షన్లు అందజేస్తున్నారు. అంతేగాక లబ్ధిదారులకు ఆర్‌బీఐఎస్‌ ద్వారా ఫేషియల్‌ అథెన్టికేషన్‌ నిర్వహిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories