AP News: వరద బాధితులకు రేపటి నుంచి నిత్యావసరాల కిట్ల పంపిణీ

AP News: వరద బాధితులందరికి నిత్యవసరాలు పంపిణీ చేసేలా చర్యలు

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 5 Sept 2024 5:59 PM IST
Distribution of necessities to flood victims from tomorrow
X

AP News: రేపటి నుంచి వరద బాధితులకు నిత్యవసరాల పంపిణీ

AP News: విజయవాడలో వరద బాధితులకు రేపటి నుంచి ప్రభుత్వం నిత్యవసరాలు పంపిణీ చేయనుంది. పంపిణీ ఏర్పాట్లపై ఇప్పటికే మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. బాధితులకు 25 కేజీల బియ్యం బస్తా, 2 కేజీల ఉల్లిపాయలు, కేజీ కందిపప్పు, 2 కేజీల బంగాళా దుంపలు, లీటరు పామాయిల్‌ను ప్రభుత్వం ఇవ్వనుంది. వరద బాధితులందరికి నిత్యవసరాలు పంపిణీ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

తొలి విడతగా 50 వేల కుటుంబాలకు ఈ సాయం అందించబోతోంది కూటమి ప్రభుత్వం. మొత్తంగా 2 లక్షల 50 వేల నిత్యావసరాల కిట్ల పంపిణీ చేయాలని ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. సహాయక చర్యలు వేగవంతం చేసిన ఏపీ సర్కార్.. పెద్ద ఎత్తున అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దించింది.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story