Andhra Pradesh: ఏపీలో అందుబాటులోకి దిశ వెహికిల్స్
Andhra Pradesh: మహిళల రక్షణ కోసం 900 వాహనాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో దిశా వెహికల్స్ (ఫైల్ ఇమేజ్)
Andhra Pradesh: మహిళల రక్షణకు పెద్దపీట వేస్తోన్న ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా పెట్రోలింగ్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మహిళా దినోత్సవం సందర్భంగా 9 వందల ద్విచక్ర వాహనాలతో పాటు 18 దిశ క్రైం సీన్ మేనేజ్‌మెంట్ వెహికల్స్‌ను ప్రారంభించారు సీఎం జగన్. దిశ- మహిళా పోలీస్ స్టేషన్లతో ఈ వెహికిల్స్ కనెక్ట్ చేయబడి ఉంటాయి. ఫిర్యాదు అందిన వెంటనే స్పందించేలా ఆధునిక సాంకేతిక వ్యవస్థను కూడా దిశ వెహికిల్స్‌లో అమర్చారు. ప్రతి బైక్‌కు ఏర్పాటు చేసిన జియో ట్యాగింగ్ వ్యవస్థతో ఘటనా స్థలానికి ఎంతసేపట్లో పోలీసులు చేరుకుంటారో తెలుసుకునేలా వెహికిల్స్ రూపొందించారు.
Next Story




