దివ్య హత్య కేసు వివరాలకోసం కదిలిన దిశ టీమ్

దివ్య హత్య కేసు వివరాలకోసం కదిలిన దిశ టీమ్
x
Highlights

విజయవాడలో దారుణ హత్యకు గురైన దివ్యతేజస్విని కేసు దర్యాప్తును దిశా స్పెషల్ టీమ్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఉన్మాది నాగేంద్ర వ్యవహార శైలి పైనా,...

విజయవాడలో దారుణ హత్యకు గురైన దివ్యతేజస్విని కేసు దర్యాప్తును దిశా స్పెషల్ టీమ్ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఉన్మాది నాగేంద్ర వ్యవహార శైలి పైనా, గతంలో జరిగిన సంఘటనలపైనా పూర్తి సమాచారం రాబట్టేందుకు మరికాసేపట్లో దివ్య తల్లి దండ్రులను దిశ స్పెషల్ ఆఫీసర్ల బృందం కలుసుకుంటోంది. ఈ టీమ్ లో సీనియర్ ఐఏఎస్ అధికారి కృతిక శుక్లా, సీనియర్ ఐపీఎస్ అధికారి దీపికా పటేల్ ఉన్నారు.

మరోవైపు దివ్యతేజస్వినితో నాగేంద్ర బాబుకు పెళ్లి అయిందన్న వార్తలను దివ్య తల్లి దండ్రులు కొట్టి పారేస్తున్నారు. నాగేంద్ర బాబుకు గంజాయి అలవాటు ఉందని గతంలో కూడా ఇంటికొచ్చి గొడవ చేశాడనీ అంటున్నారు. హత్య జరిగిన రోజు కూడా గంజాయి సేవించి వచ్చాడని వారు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా దివ్య హత్య కేసు నిందతుడి స్టేట్ మెంట్ ను అధికారులు రికార్డు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories