Disha App: రెండు నిండు ప్రాణాలను కాపాడిన దిశ యాప్‌

Disha App: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేసిన దిశ యాప్‌ తాజాగా ఇద్దరి ప్రాణాలను కాపాడింది.

Arun Chilukuri
Published on: 27 Aug 2021 4:50 PM IST
Disha App Saves Two Lifes in vijayawada
X

Disha App: రెండు నిండు ప్రాణాలను కాపాడిన దిశ యాప్‌

Disha App: ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేసిన దిశ యాప్‌ తాజాగా ఇద్దరి ప్రాణాలను కాపాడింది. విజయవాడలో నమ్మిన వ్యక్తి మోసం చేయడంతో ఓ బ్యాంకు ఉద్యోగిని మనస్తాపానికి గురై శానిటైజర్‌ తాగి ఆత్మహత్యాకు యత్నించింది. చివరి క్షణంలో తన 13 నెలల చిన్నారిని కాపాడాలంటూ దిశ యాప్‌కు సందేశం పంపింది. క్షణాలలో మెరుపులా దిశ టీం రంగంలోకి దిగి తల్లికూతుళ్ల ప్రాణాలు కాపాడారు.

ప్రాణాపాయస్థితి నుంచి బాధితురాలిని రక్షించి ఆమె బిడ్డను వారి సంరక్షణలోనే ఉంచుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదు చేసారు. మహిళ కోలుకుని స్పృహలోకి వచ్చిన తర్వాత ఆమె స్టేట్‌మెంట్‌ ఆధారంగా సెక్షన్లలో మార్పులు చేర్పులు చేయనున్నట్లు పోలీస్‌ అధికారులు తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story