Disha App: ఈ యాప్‌ మీ దగ్గర ఉంటే.. ఒక అన్న మీతో ఉన్నట్టే- సీఎం జగన్‌

Disha App: సీతానగరం అత్యాచారం ఘటన తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు సీఎం జగన్.

Arun Chilukuri
Published on: 29 Jun 2021 3:58 PM IST
Disha App Helps Women in Danger Says CM Jagan
X

Disha App: ఈ యాప్‌ మీ దగ్గర ఉంటే.. ఒక అన్న మీతో ఉన్నట్టే- సీఎం జగన్‌

Disha App: సీతానగరం అత్యాచారం ఘటన తనను ఎంతగానో కలచివేసిందని చెప్పారు సీఎం జగన్. అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకే దిశ యాప్‌ను తీసుకొచ్చామని చెప్పారు. ఈ యాప్‌ మహిళల మొబైల్‌ ఫోన్‌లో ఉంటే.. ఒక అన్న వారికి తోడుగా ఉన్నట్టేనని వివరించారు. ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే విధంగా ఇంటింటికి వెళ్లి వాలంటీర్లు, ఆశా వర్కర్లు అవగాహన కల్పించాలని అన్నారు సీఎం జగన్.

ఇప్పటికే 17 లక్షల మంది దిశ యాప్‌ డౌన్‌లోడ్ చేసుకున్నారని, స్మార్ట్ ఫోన్‌ ఉండే ప్రతి మహిళ వద్ద దిశ యాప్ ఉండాలని సీఎం జగన్‌ చెప్పారు. పోలీసులు మనకు మంచి చేసే ఆప్తులు, మహిళల భద్రత, రక్షణపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని సీఎం జగన్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 18 దిశ పోలీస్‌స్టేషన్లు ఏర్పాటు చేసి, దిశ చట్టం కూడా చేశామని సీఎం జగన్‌ తెలిపారు. దిశ కేసుల కోసం పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం చేపట్టామని, దిశ కేసుల విచారణ కోసం త్వరలోనే ప్రత్యేక కోర్టులు కూడా ఏర్పాటు చేస్తామని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story