Brahmamgari Matam: కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో మంతనాలు

Brahmamgari Matam: కడప బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది.

Arun Chilukuri
Published on: 22 Jun 2021 12:55 PM IST
Discussions Begins at Brahmamgari Matam
X

Brahmamgari Matam: కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలో మంతనాలు

Brahmamgari Matam: కడప బ్రహ్మంగారి మఠాధిపతి ఎంపిక మళ్లీ మొదటికి వచ్చింది. బ్రహ్మంగారి మఠం వారసత్వంపై కుటుంబీకుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. బ్రహ్మంగారి వారసుల మధ్య సయోధ్య కోసం కర్ణాటకకు చెందిన గాలి కరుణాకర్‌రెడ్డి ప్రయత్నించినట్లు సమాచారం. మధ్యవర్తిని పంపి రాజీ కోసం మంతనాలు చేసినట్లు తెలుస్తోంది. గత పీఠాధిపతి నుంచి గాలి కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు సమాచారం.

ఇక బ్రహ్మంగారి వారసత్వ కుటుంబాలతో మంత్రి వెల్లంపల్లి చర్చలు జరిపారు. సమిష్టిగా చర్చించుకొని ఏకాభిప్రాయానికి వస్తే పీఠాధిపతిని నియమిస్తామని చెప్పారు మంత్రి వెల్లంపల్లి. కుటుంబాల మధ్య ఏకాభిప్రాయం కోసం గత పీఠాధిపతి మొదటి భార్య సంతానం, రెండవ భార్యతో మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. అయితే మొదటి భార్య రెండవ కుమారుడు తనకే పీఠాధిపత్యం కావాలని పట్టు పట్టబడుతున్నట్లు సమాచారం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story