విశాఖలో చిన్నారుల అదృశ్యం కలకలం

Visakhapatnam: శిశుగృహ రక్షణలో ఉన్న ముగ్గురు చిన్నారులు

Rama Rao
Published on: 4 May 2022 10:12 AM IST
Disappearance of Children in Visakhapatnam
X

విశాఖలో చిన్నారుల అదృశ్యం కలకలం

Visakhapatnam: విశాఖలో చిన్నారుల అదృశ్యం కలకలం సృష్టించింది. ఆర్ అండ్ బి దగ్గర స్త్రీ శిశు సంక్షేమ శాఖకు సంబంధిన శిశుగృహ రక్షణలో ఉన్న ముగ్గురు చిన్నారులు అదృశ్యం అయ్యారు. ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్లో శిశు గృహ సంరక్షకులు ఫిర్యాదు చేశారు. తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన రోడ్డుపై ఉన్న ముగ్గురు చిన్నారులనుచైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోర్స్ సభ్యులు వారం రోజుల క్రితం గుర్తించారు.

తల్లిదండ్రులు వచ్చేంత వరకు రక్షణకా ఉంచాలంటూ శిశుగృహకు అప్పగించారు. నిన్న ఉదయం గేటు బయట ఆడుకుంటూ అదృశ్యం అయిన చిన్నారులను మహాలక్ష్మి, ఏడుకొండలు, మరియమ్మగా గుర్తించారు. చుట్టు పక్కల వెతికినా చిన్నారుల ఆచూకీ లభించలేదు. కూలి పనులు చేసుకునేందుకు వేరే ప్రాంతం నుంచి తమ తల్లిదండ్రులతో ఇక్కడకు వచ్చినట్టు పిల్లలు చెప్పారు. ఎయిర్ పోర్టు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Rama Rao

Rama Rao

Next Story