CM Jagan: ఎర్రగుంటలో సీఎం జగన్ ను కలిసిన దివ్యాంగులు

CM Jagan: మార్గమధ్యలో నూతన వధువరులను ఆశీర్వదించిన సీఎం జగన్

Shashank Gullapelli
Published on: 28 March 2024 3:21 PM IST
Disabled People Meet CM Jagan In Yerraguntla
X

CM Jagan: ఎర్రగుంటలో సీఎం జగన్ ను కలిసిన దివ్యాంగులు

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా చేపట్టిన మీమంత సిద్ధం యాత్రలో దారిపొడవునా ప్రజల నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తూ.. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. ఎర్రగుంట వెళ్లే మార్గంలో వివాహం చేసుకున్న వెంకటస్వామి, కావేరి దంపతులను సీఎం జగన్ ఆశీర్వదించారు. ఈ సందర్భంగా జగన్ పై అభిమానం చాటుకున్నారు ఆ నూతన వధువరులు.

ఎర్రగుంట్లలో సీఎం జగన్ ను దివ్యాంగులు కలిశారు. సీఎం జగన్ తో ముచ్చటించారు. అప్యాయంగా వారితో మాట్లాడారు సీఎం జగన్. ఈ సందర్భంగా దివ్యాంగ దంపతులు స్కెచ్ తో గిసిన ఫోటోని సీఎం జగన్ కు బహూకరించారు. వైసీపీ పాలనలో ప్రభుత్వ పథకాలు అందాయని, పెన్షన్ తో పాటు సొంతింటి కల నెరవేరిందని సంతోషం వ్యక్తం చేశారు ఆ దంపతులు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story