సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌: ఆర్‌. నారాయణమూర్తి

సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌: ఆర్‌. నారాయణమూర్తి
x
ఆర్‌. నారాయణమూర్తి
Highlights

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టిన సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌ అన్నారు ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి. బడుగు, బలహీన వర్గాల వారికోసం...

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టిన సీఎం జగన్‌కు హ్యాట్సాఫ్‌ అన్నారు ప్రముఖ సినీ నటుడు ఆర్. నారాయణమూర్తి. బడుగు, బలహీన వర్గాల వారికోసం ఇంగ్లీష్ భోదన ప్రవేశపట్టడం పట్ల సీఎం జగన్ ను అభినంధించారు ఆర్. నారాయణమూర్తి.

తాను విద్యార్ధి తరంలో ఉన్న సమయంలో ఇంగ్లీష్ చదవక పోవడంతో తీవ్రంగా నష్టపోయామన్నారు. తెలుగు నేర్చుకున్న వారంతా అమ్మానాన్న అనడం లేదని మమ్మిడాడి అంటున్నారని చెప్పారు. పోటీ పరీక్షల్లో ఇంగ్లీష్ చదువుకున్నవారితో తెలుగుమీడియం వారు పోటీపడలేకపోతున్నారని అన్నారు. అందరికీ సామాజిక న్యాయం జరగాలంటే ఇంగ్లీషు నేర్చుకుని తీరాలన్నారు నారాయాణ మూర్తి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories