గుంటూరు ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన దినేష్ కుమార్

dinesh kumar takes charge as guntur incharge collector
x

గుంటూరు ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన దినేష్ కుమార్

Highlights

* ప్రస్తుత కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌ను తప్పించిన ఎస్‌ఈసీ * జాయింట్‌ కలెక్టర్ దినేష్‌ కుమార్‌కు కలెక్టర్‌గా బాధ్యతలు * అభినందనలు తెలిపిన జిల్లా అధికార యంత్రాంగం

గుంటూరు జిల్లా ఇన్‌చార్జ్‌ కలెక్టర్‌గా దినేష్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కలెక్టర్ శామ్యూల్‌ ఆనంద్‌ను విధుల నుంచి ఎస్‌ఈసీ తప్పించింది. ఈ మేరకు జాయింట్‌ కలెక్టర్ దినేష్‌ కుమార్‌కు కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. జిల్లా అధికార యంత్రాంగం దినేష్‌ కుమార్‌కు అభినందనలు తెలిపారు.

గుంటూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభయ్యాయి. తొలి విడత ఎన్నికల సిబ్బందికి కలెక్టరేట్లో శిక్షణ నిర్వహిస్తున్నారు. శిక్షణ సమావేశానికి జాయింట్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి హాజరయ్యారు. తెనాలి డివిజన్ పరిధిలోని స్టేజ్-1 అధికారులు శిక్షణ ప్రారంభమైంది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాజీపడమని, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories