Satya Kumar: డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.. రిపోర్ట్ వస్తే.. తగు చర్యలు తీసుకుంటాం

Diarrhea Cases in Vijayawada Minister Satyakumar Visits Says Situation Under Control
x

Satya Kumar: డయేరియాపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాం.. రిపోర్ట్ వస్తే.. తగు చర్యలు తీసుకుంటాం

Highlights

Satya Kumar: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరపేటలో డయేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తెలిపారు.

Satya Kumar: విజయవాడలోని న్యూ రాజరాజేశ్వరపేటలో డయేరియా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఈ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితిని స్వయంగా పరిశీలించడానికి ఆయన నేడు పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులను పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ, డయేరియా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. "ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేయించాం. ప్రజల్లో డయేరియాపై అవగాహన కల్పిస్తున్నాం. నీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపాం. మొదటి విడత టెస్టుల్లో ఎలాంటి సమస్యలు కనిపించలేదు. అయితే, మరింత నిర్ధారణ కోసం మరోసారి శాంపిళ్లను పరీక్షకు పంపాం. రిపోర్ట్ వచ్చిన తర్వాత తగు చర్యలు తీసుకుంటాం" అని ఆయన వివరించారు.

బాధితులతో మాట్లాడినప్పుడు, వారు పానిపూరి, వంకాయ ఎండుచేపలు తినడం వల్ల అస్వస్థతకు గురైనట్లు చెప్పారని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉందని, డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలను అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. ప్రజలు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని, వీలైనంత వరకు బయట ఆహారం తీసుకోవడం మానుకోవాలని ఆయన సూచించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories