Kurnool: రైతు తలరాతను మార్చిన తొలకరి.. పొలంలో దొరికిన వజ్రం.. దాని ధర ఎంతంటే ?

Daimond: కర్నూలు జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది.

Arun Chilukuri
Updated on: 6 Jun 2023 6:00 PM IST
Diamond Worth 2 Crore Found by Farmer in Kurnool
X

Kurnool: రైతు తలరాతను మార్చిన తొలకరి.. పొలంలో దొరికిన వజ్రం.. దాని ధర ఎంతంటే ?

Daimond: కర్నూలు జిల్లాలో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మద్దికెర మండలం బసనేపల్లిలో రైతుకు పొలం పనులు చేస్తుండగా కోట్ల విలువ చేసే వజ్రం లభ్యం అయింది. అయితే.. ఆ వజ్రాన్నిఅమ్మేందుకు అన్ని ప్రయత్నాలు చేశాడా రైతు. లభించిన వజ్రం విలువ సుమారు రెండుకోట్ల రూపాయల వరకు ఉంటుందని తెలియడంతో ఆ రైతు సంబ్రమాశ్చార్యంలో మునిగిపోయాడు. దీంతో ఆ వజ్రాన్ని కొనడానికి వ్యాపారులు పోటీ పడ్డారు. కాగా ఈ సంవత్సరం తొలకరి వర్షాలకి దొరికిన విలువైన వజ్రం అని స్ధానికులు చెబుతున్నారు.

అనంతపురం, కర్నూలు జిల్లాల సరిహద్దుల్లో విలువైన వజ్రాలున్నాయని చరిత్రకారులు అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ముఖ్యంగా మద్దికెర ప్రాంతంలో వజ్రాల వేట కోసం జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి ప్రజలు వచ్చి అన్వేషణ కొనసాగిస్తుంటారు. బసినేపల్లిలో ఓ రైతుకు విలువైన వజ్రం దొరికిందని తెలియగానే గ్రామస్థులు కూడా తమ అదృష్ట్రాన్ని పరీక్షించుకోవడానికి పంట పొలాల బాటన పట్టి అన్వేషణ మొదలు పెట్టారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story