Chandrababu: చంద్రబాబుకు ఐటీ నోటీసులపై డైలాగ్‌ వార్

Chandrababu: చంద్రబాబుకు ఐటీ నోటీసులపై అసెంబ్లీలో చర్చించే ఛాన్స్

Jyothi
Published on: 8 Sept 2023 8:16 AM IST
Dialogue War on IT Notices to Chandrababu
X

Chandrababu: చంద్రబాబుకు ఐటీ నోటీసులపై డైలాగ్‌ వార్

Chandrababu: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ సారి వాడి వేడిగా సాగనున్నాయి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఉన్న లేకున్నా కీలక అంశాలతో అసెంబ్లీ సమావేశాలను ఉపయోగించుకోవాలి అనుకుంటుంది అధికార పార్టీ. ఏపీ సీఎం జగన్ ప్రస్తుతం లండన్ టూర్‌లో ఉన్నారు. ఆయన వచ్చాక అసెంబ్లీ సమావేశాలపై క్లారిటీ రానుంది. మరో వైపు అసెంబ్లీ వేదికగా ప్రతిపక్ష టీడీపీపై యుద్ధం ప్రకటించబోతుంది అధికార వైసీపీ.

అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు ఐటీ నోటీసుల అంశం కీలకంగా మారనుందని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వన్ షాట్ ఆల్ బర్డ్స్ కాన్సెప్ట్‌తో వ్యవహరించాలని ప్లాన్ చేస్తోంది. ఇప్పటికే ఐటీ నోటీసుల వ్యవహారంలో చంద్రబాబుపై ముప్పేట దాడికి దిగారు వైసీపీ నేతలు. రాజధాని ముడుపుల్లో అక్రమాలపై సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు. 118 కోట్లు ఎక్కడివని ప్రశ్నిస్తున్నారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రభుత్వ దర్యాప్తు వ్యవస్థలు కూడా రంగంలోకి దిగి, విచారణ చేస్తున్నాయి.

పోలవరం, అమరావతి, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లపై గత అసెంబ్లీ సమావేశాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు సీఎం జగన్. ఈసారి జరగబోయే సమావేశాల్లోనూ చంద్రబాబు హయాంలో జరిగిన అవినీతి ఆరోపణలు, ఐటీ నోటీసులు మెయిన్ సబ్జెక్ట్‌గా అసెంబ్లీ వేదికగా మాట్లాడనున్నారు సీఎం జగన్. ఇక అసెంబ్లీ తర్వాత నుంచి ఎన్నికలు టార్గెట్‌గా పావులు కదపనున్నారు ఏపీ సీఎం.

Jyothi

Jyothi

Next Story