జేసీ బ్రదర్స్ పై ధర్మవరం ఎమ్మెల్యే ఫైర్..

అనంతపురం జేసీ బ్రదర్స్ పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు.

Raj
By Raj
Published on: 15 Jun 2020 12:40 PM IST
జేసీ బ్రదర్స్ పై ధర్మవరం ఎమ్మెల్యే ఫైర్..
X

అనంతపురం జేసీ బ్రదర్స్ పై ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఫైర్ అయ్యారు. అధికారంలో ఉండగా అశోక్ లైల్యాండ్ వారు స్ర్కాబ్ క్రీంద లారీలు, బస్సులు అమ్మితే వీటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి నాగాలాండ్ లో రిజిస్ర్టేషన్ చేయీంచీ రాష్ట్రవ్యాప్తంగా తిప్పారని అన్నారు. అటువంటి లారీలను బస్సులతో ప్రజల జీవితాలతో ఆడుకున్నారని.. పనికీ రాని ఈ వాహనాలను అధిక ధరలకు అమ్మీ ప్రజల ఉసురు తీశారన్నారు. దొంగ బస్సులను లారీలను పోలీసులు పట్టుకోకుండా వాటి వెనుక జేసి స్టిక్కర్లు అంటించీ వాటిని రవాణా చేసారని అన్నారు.

కానీ ఇప్పుడు సత్య హరీశ్చంద్రులం అనీ ప్రగల్భాలు పలుకుతున్నారని ఎద్దేవా చేశారు. అవినీతీ చేసిన ఎవరిని సీఎం జగన్ వదలని అన్నారు. మొన్న అచ్చేనాయుడు నిన్న జేసి రేపు ఎవరో ? అని అన్నారు. కాగా బీఎస్-3 వాహనాలను బీఎస్-4 వాహనాలుగా మార్చడం, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసి ఏఫీకి తరలించారనే అభియోగంతో జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. వారికి 14 రోజుల రిమాండ్ విధించడంతో ప్రస్తుతం కడప సెంట్రల్ జైలులో ఉన్నారు.


Raj

Raj

Next Story