Dharmana Krishna Das Take Charges as Deputy CM: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే..

Arun Chilukuri
Published on: 25 July 2020 3:09 PM IST
Dharmana Krishna Das Take Charges as Deputy CM: డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన.. తొలి సంతకం ఆ ఫైల్ పైనే..
X

dharmana krishna das take charges as deputy cm: ఏపీ ఉపముఖ్యమంత్రిగా ధర్మాన కృష్ణదాస్‌ బాధ్యతలు చేపట్టారు. ఆదాయ ధ్రువీకరణకు సంబంధించిన దస్త్రాలపై కృష్ణదాస్‌ తొలి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌‌ నమ్మకం నిలబెట్టేలా పనిచేస్తానని తెలిపారు. బియ్యం కార్డు ఉన్న వారికి ఇకపై ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదని ఆయన ప్రకటించారు. అర్హులైన వారికి ఆగస్టు 15న 30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి దాదాపు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తెలిపారు. ఒకసారి ఆదాయ ధ్రువీకరణ పత్రం తీసుకుంటే నాలుగేళ్ల వరకు చెల్లుబాటు అవుతుందని చెప్పారు. సమస్యలు పరిష్కరించి ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తానని ఈ సందర్భంగా ధర్మాన తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story