భూముల రీ సర్వే చారిత్రాత్మక నిర్ణయం : డిప్యూటీ సీఎం

భూముల రీ సర్వే చారిత్రాత్మక నిర్ణయం : డిప్యూటీ సీఎం
x
Highlights

ఈ నెల 21న జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సీఎం జగన్ భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభిచనున్నట్లు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ప్రభుత్వం...

ఈ నెల 21న జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడులో సీఎం జగన్ భూముల రీసర్వే కార్యక్రమాన్ని ప్రారంభిచనున్నట్లు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ చెప్పారు. ప్రభుత్వం అమలు చేయబోతున్న భూముల రీ సర్వే చారిత్రాత్మక నిర్ణయమన్నారు. 2023 జులై నాటికి భూముల రీ సర్వే పూర్తి చేయాలని భావిస్తున్నట్లు మంత్రి ధర్మాన చెప్పారు. భూమి అంశంలో ఏ చిన్న సమస్య ఉండకూడదు అని సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. సర్వే ఆఫ్ ఇండియాతో కలిసి పని చేస్తున్నామని స్థిరాస్తులు అన్ని సర్వే చేస్తామని తెలిపారు. గ్రామ సచివాలయాల్లోనూ భూ రికార్డులు అందుబాటులో ఉంటాయని మంత్రి ధర్మాన చెప్పారు. ఇప్పటికే భూ సర్వే అంశంపై ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ మొదలయ్యాయని చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories