TTD: తిరుమల కొండపై వసతి గృహాల అద్దెల పెంపుపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్లారిటీ

TTD: రాజకీయ పార్టీలు అనవసరంగా రచ్చచేస్తున్నాయి - ఈవో ధర్మారెడ్డి

Jyothi
Published on: 12 Jan 2023 7:31 PM IST
Dharma Reddy Gives Clarity Increase Price Rented Rooms Tirumala
X

TTD: తిరుమల కొండపై వసతి గృహాల అద్దెల పెంపుపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్లారిటీ

TTD: తిరుమల కొండపై వసతి గృహాల అద్దెల పెంపుపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి క్లారిటీ ఇచ్చారు. వివిధ రాజకీయ పార్టీలు అనవసరంగా రచ్చచేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విఐపీలు అధికంగా స్టే చేసే ఎస్వీ గెస్ట్‌ హౌస్‌లో మాత్రమే అద్దె పెంచినట్లు స్పష్టం చేశారు. పద్మావతి ప్రాంతంలో ఉన్న విఐపీలకు కేటాయించే గదులను 8 కోట్ల వ్యయంతో ఆధునీకరణ చేసినట్లు తెలిపారు. టీటీడీ ఆదాయం కోసం గదుల ధరలు పెంచలేదని... మోడ్రనైజ్‌ చేసినందుకు వీఐపీ గెస్ట్‌హౌస్‌ల్లో తేడా ఉండకూడదని ధరలు పెంచినట్లు చెప్పారు. ధరల పెంపుపై విమర్శించే వారు తిరుమల వచ్చి స్వయంగా పరిశీలించవచ్చని ఈవో తెలిపారు.

Jyothi

Jyothi

Next Story