Karthika Masam: క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ.. కార్తీక మొదటి సోమవారం కావడంతో ప్రత్యేక పూజలు

Karthika Masam: ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి పూజలు చేస్తున్న భక్తులు

Jyothi
Published on: 20 Nov 2023 10:34 AM IST
Devotees Rush in Ksheera Ramalingeswara Swamy Temple
X

Karthika Masam: క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ.. కార్తీక మొదటి సోమవారం కావడంతో ప్రత్యేక పూజలు

Karthika Masam: పశ్చిమగోదావరి జిల్లాలోని పంచారామ క్షేత్రమైన పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. పవిత్ర కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి పోటెత్తారు. శివునికి అత్యంత ప్రీతి పాత్రమైన కార్తీకమాసంలో స్వామి వారిని దర్శించుకుంటే మోక్షం కలుగుతుందని భక్తులు నమ్ముతారు.

ఈ నేపథ్యంలోనే పంచారామ క్షేత్రాల్లో ఒకటిగా వర్ధిల్లుల్లుతున్న క్షీరా రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. కార్తీక స్నానం ఆచరించి స్వామివారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తొలి పంచామృతాభిషేక పూజలు నిర్వహించగా.. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించి భక్తులు పూజలు చేస్తున్నారు.

Jyothi

Jyothi

Next Story