టీటీడి పరిపాలనా భవనం అంగప్రదక్షణ భక్తుల ర్యాలీ

*కౌంటర్లోనే అంగప్రదక్షణ సేవాటిక్కెట్లు జారీ చేయాలని డిమాండ్

Rama Rao
Published on: 14 Jun 2022 4:21 PM IST
Devotees Protest in TTD Administration Building
X

టీటీడి పరిపాలనా భవనం అంగప్రదక్షణ భక్తుల ర్యాలీ

Tirupati: శ్రీవారి సన్నిధిలో ప్రతిరోజూ నిర్వహించే అంగప్రదక్షిణ సేవపై తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న నిర్ణయంపై భక్తులు ఆందోళనకు దిగారు. ఇన్నాళ్లు ఇబ్బంది లేకుండా... జారీచేస్తున్న విధంగానే టిక్కెట్లను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఉన్నట్లుండి అంగప్రదక్షిణ సేవా టిక్కెట్లను ఆన్లైన్లో జారీ చేయాలని నిర్ణయం తీసుకోవడం సాహేతుకంకాదని శ్రీవారి భక్తులు ఆగ్రహించారు. టీటీడీ అధికారులు అంగప్రదక్షిణ టిక్కెట్ల జారీపై సముచిత నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Rama Rao

Rama Rao

Next Story