పశ్చిమ గోదావరి జిల్లాలోని శివాలయాల్లో సందడి.. రామలింగేశ్వరస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు

* కార్తీక సోమవారం సందర్భంగా బారులు తీరిన భక్తులు

R Tripura Malini
Published on: 14 Nov 2022 9:05 AM IST
Devotees flock to Ramalingeshwar Swamy temple
X

పశ్చిమ గోదావరి జిల్లాలోని శివాలయాల్లో సందడి

Ramalingeshwara Swamy Temple: పశ్చిమగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రమైన క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన కార్తీకమాసం సందర్భంగా ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో పోటెత్తారు. షష్టి సోమవారం సందర్భంగా శివుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మమోగుతోంది. వేకువజామునే చన్నీటి స్నానాలు ఆచరించి ఆలయానికి చేరుకున్న భక్తులు మూల విరాట్‌కు పాలాభిషేకాలు నిర్వహిస్తున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story