Tirumala: 44 నిమిషాల్లోనే 2.20 లక్షల టికెట్లు ఖాళీ.. ఆ రోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు అనుమతించరు..

Devotees Booked 2 Lakh Tirumala Special And Vaikunta Dwara Darshan Tickets With In 45 Minutes
x

Tirumala: 44 నిమిషాల్లోనే 2.20 లక్షల టికెట్లు ఖాళీ.. ఆ రోజు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు అనుమతించరు..

Highlights

Vaikuntha Ekadashi 2023: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వార దర్శన టికెట్లను శనివారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

Vaikuntha Ekadashi 2023: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ).. ప్రత్యేక ప్రవేశ, వైకుంఠ ద్వార దర్శన టికెట్లను శనివారం ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. జనవరి 1 నుంచి 11 వ తేదీ వరకు 2.20 లక్షల టికెట్లను అందుబాటులో ఉంచారు. వైకుంఠ ద్వార దర్శన టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. ఆన్‌లైన్‌లో విడుదలైన 44 నిమిషాల్లోనే టికెట్లు అయిపోయాయి. జనవరి 2 న వైకుంఠ ఏకాదశి, 3 న వైకుంఠ ద్వారా దర్శనాలకు టీటీడీ బోర్డు విస్తృత ఏర్పాట్లు చేసింది.

ఈ నెల 27 న తిరుమల ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఆ రోజున వీఐపీ బ్రేక్‌ దర్శనాలను టీటీడీ అనుమతించదు. సోమవారం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుమల ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరుగుతుంది. ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 26 న ఎలాంటి సిఫారసు లేఖలను స్వీకరించరని, భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories