Devineni Uma: ఎన్నికల ప్రచారానికి దేవినేని రెడీ

Devineni Uma: మైలవరం నియోజకవర్గంలో ఇవాళ దేవినేని పర్యటన

Jyothi
Published on: 21 Feb 2024 1:49 PM IST
Devineni is Ready for Election Campaign
X

Devineni Uma: ఎన్నికల ప్రచారానికి దేవినేని రెడీ

Devineni Uma: ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో మాజీ మంత్రి దేవినేని ఉమ ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. మరోవైపు మైలవరం టికెట్ ను వసంత కృష్ణప్రసాద్ ఆశిస్తున్నారు. వసంత కృష్ణప్రసాద్, బొమ్మసాని సుబ్బారావుపై పార్టీ అధిష్టానం సర్వే చేపట్టింది. వసంతకృష్ణప్రసాద్ పార్టీలో చేరికపై గతంలో దేవినేని ఉమ పరోక్షంగా సెటైర్లు వేస్తూ వచ్చారు.

దేవినేని, వసంత మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం కొనసాగింది. పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం మైలవరం సీటుపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమ మైలవరం వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి కేశినేని చిన్నితో కలిసి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తన పర్యటన ఎన్నికల ప్రచారం కాదు.. బాబు ష్యురిటీ- భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంటున్నారు దేవినేని ఉమా.

Jyothi

Jyothi

Next Story