అన్నమయ్య జిల్లా తుంబళ్లపల్లె డిప్యూటీ తాసిల్దార్ అరెస్ట్

Annamayya district: MLS పాయింట్ స్టాక్ గోడౌన్‌లో పీడీఎస్‌ బియ్యం దుర్వినియోగం

Shekhar G
Published on: 28 Jun 2023 4:13 PM IST
Deputy Tahsildar Of Thamballapalle Of Annamayya District Arrested
X

అన్నమయ్య జిల్లా తుంబళ్లపల్లె డిప్యూటీ తాసిల్దార్ అరెస్ట్

Annamayya district: అన్నమయ్య జిల్లా తుంబళ్లపల్లె డిప్యూటీ తాసిల్దార్‌ పసుపులేటి హరిప్రసాద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. MLS పాయింట్ స్టాక్ గోడౌన్‌లో జరిగిన పీడీఎస్ బియ్యం దుర్వినియోగం చేసినట్లు సివిల్ సప్లై మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డిప్యూటీ తాసిల్దార్‌ పసుపులేటి హరిప్రసాద్‌ను కొద్దిరోజుల క్రితమే సస్పెన్షన్ చేస్తూ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. డిప్యూటీ తాసిల్దార్‌గా ఉన్న హరిప్రసాద్‌ మరికొందరు సిబ్బందిని కలుపుకుని చేతివాటం ప్రదర్శించినట్టు తెలియడంతో దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపారు. ఆరోపణలు వాస్తవమని తేలడంతో సస్పెన్షన్‌లో ఉన్న హరిప్రసాద్‌పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Shekhar G

Shekhar G

Next Story