పంచాయతీరాజ్ ఉద్యోగులతో రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ: 'మాటా-మంతి' ద్వారా దిశా నిర్దేశం

పంచాయతీరాజ్ ఉద్యోగులతో రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ: మాటా-మంతి ద్వారా దిశా నిర్దేశం
x

పంచాయతీరాజ్ ఉద్యోగులతో రేపు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ: 'మాటా-మంతి' ద్వారా దిశా నిర్దేశం

Highlights

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ రేపు (బుధవారం, డిసెంబర్ 10, 2025) తన శాఖ ఉద్యోగులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కల్యాణ్ రేపు (బుధవారం, డిసెంబర్ 10, 2025) తన శాఖ ఉద్యోగులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. 'మాటా-మంతి' పేరుతో ఈ సమావేశం మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్‌లో జరగనుంది. ఈ భేటీకి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి సుమారు రెండు వేల మంది పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు హాజరుకానున్నారు.

ఉద్యోగులతో మాట్లాడనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ప్రజలకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించే దిశగా వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. పదోన్నతులతో ఉత్సాహంగా ఉన్న ఉద్యోగులందరినీ సమాయత్తం చేసి, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునివ్వనున్నారు.

పంచాయతీరాజ్ శాఖలో గత 17 నెలల కాలంలో అనేక సంస్కరణలు అమలు చేశామని, పాలనలో పారదర్శకత పెంచడం కోసం 'స్వర్ణ పంచాయతీ' పోర్టల్‌ను కూడా ప్రారంభించామని ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశం ఉంది.

ఈ సమావేశం ద్వారా క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాలపై ఉద్యోగుల నుంచి అభిప్రాయాలను తెలుసుకుని, ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వారిని కార్యోన్ముఖులను చేయాలని పవన్ కల్యాణ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories