Pawan Kalyan: కోడూరులో పొలాలను పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు.

Arun Chilukuri
Published on: 30 Oct 2025 3:03 PM IST
Pawan Kalyan: కోడూరులో పొలాలను పరిశీలించిన పవన్‌ కల్యాణ్‌
X

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) మొంథా తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా కల్పించారు. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ నియోజకవర్గం, కోడూరు మండలం, కృష్ణాపురం గ్రామంలో ఆయన బుధవారం పర్యటించారు.

భారీ వర్షాల ధాటికి దెబ్బతిన్న పంట పొలాలను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేస్తూ, నష్టం వివరాలను నేరుగా రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు.

తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతులు తమ ఆవేదనను పవన్ కల్యాణ్‌కు వివరించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ధైర్యం చెబుతూ, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని వారికి హామీ ఇచ్చారు. నష్ట పరిహారం అందించే విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story