వీరజవాన్‌ ప్రవీణ్‌కుమార్ కుటుంబానికి రూ.50 లక్షలు చెక్కును అందించిన డిప్యూటీ సీఎం!

వీరజవాన్‌ ప్రవీణ్‌కుమార్ కుటుంబానికి రూ.50 లక్షలు చెక్కును అందించిన డిప్యూటీ సీఎం!
x
Highlights

వైసీపీ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని, ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ భూమిని వీలైనంత త్వరలో అందిస్తామని మంత్రి పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు.

పాకిస్తాన్ ఉగ్రదాడిలో పోరాడి అమరుడైన వీర జవాన్ ప్రవీణ్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు ఏపీ ప్రభుత్వం అండగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డిలు ప్రవీణ్ కుటుంబ సభ్యలకు 50 లక్షల చెక్కును అందించారు. వైసీపీ ప్రభుత్వం అన్ని వేళలా అండగా ఉంటుందని, ప్రవీణ్ కుమార్ రెడ్డి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, వ్యవసాయ భూమిని వీలైనంత త్వరలో అందిస్తామని మంత్రి పెద్దిరెడ్డి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లెకు చెందిన ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి గత 18 ఏళ్లుగా భారత సైన్యంలోని మద్రాస్‌ రెజిమెంట్‌లో త‌న సేవ‌ల‌ను అందించారు. ప్రవీణ్‌కుమార్‌కు భార్య రజిత, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories