మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం ఏరియల్ సర్వే

మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏరియల్ సర్వే నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 13 Nov 2025 3:22 PM IST
మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం ఏరియల్ సర్వే
X

మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం ఏరియల్ సర్వే

మంగళంపేట అటవీ ప్రాంతంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏరియల్ సర్వే నిర్వహించారు. అటవీ ప్రాంతంలోని కొంత భూమి ఆక్రమణకు గురైందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఏరియల్‌ సర్వేలో ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు డిప్యూటీ సీఎం పవన్‌. ఆక్రమణకు గురైన ప్రాంతాన్ని ఆయన వీడియో తీశారు.

ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్. ఆక్రమణలతో మాజీమంత్రి పెద్దిరెడ్డికి సంబంధం ఉందని అన్నారు. ఇందుకు సంబంధించి ఆధారాలు కూడా ఉన్నట్టు పవన్‌ చెప్పారు.


ఆక్రమణలపై సీఎం చంద్రబాబు, కేబినెట్‌కు వివరించిన పవన్.. ఈ ఆక్రమణలపై విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. అలాగే.. అటవీ భూములను ఆక్రమించిన వారి పేర్లు వెబ్‌సైట్‌లో పెట్టాలని సూచించారు. విజిలెన్స్‌ నివేదిక కఠిన చర్యలు తీసుకోవాలన్నారు పవన్ కల్యాణ్.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story