Chittoor District: బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ల సొమ్ము మాయం

* దాదాపు రూ.3 కోట్లు పైగా స్వాహా చేసినట్లు నిర్ధారణ * పొదుపు సంఘాలు, వ్యక్తిగత ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్ము స్వాహా

Sandeep Reddy
Updated on: 26 Aug 2021 12:30 PM IST
Deposit Money Theft by Bank Employees Cooperation in Chittoor District Kaligiri Bank of Baroda Bank
X

బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ల సొమ్ము మాయం (ఫైల్ ఫోటో)

Chittoor: చిత్తూరు జిల్లా కలికిరిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో డిపాజిట్ల సొమ్ము మాయమయ్యాయి. దాదాపు మూడు కోట్ల రూపాయలకు పైగానే స్వాహా చేసినట్లు నిర్ధారణ అయ్యింది. పొదుపు సంఘాలు, వ్యక్తిగత ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్ల సొమ్మును సిబ్బంది కాజేసినట్లుగా తెలుస్తోంది. 15 ఏళ్లుగా తాత్కాలిక మెసెంజర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తి కొందరు బ్యాంక్ ఉద్యోగుల సహకారంతో భార్య ఖాతాలోకి నగదు ట్రాన్స్ ఫర్ చేసిన వైనం తాజాగా వెలుగులోకి వచ్చింది. పొదుపు సంఘాలు తమ ఖాతాలో డబ్బు మాయమైందని తెలియడంతో కలికిరి పీఎస్ లో ఫిర్యాదు చేశారు. మహిళా సంఘాలకు చెందిన సొమ్ము పెద్దమొత్తంలో స్వాహా చేసినట్లు గుర్తించి సమగ్ర విచారణ జరిపించాలని కోరుతున్నారు వెలుగు సిబ్బంది. తమను న్యాయం చెయాలని వేడుకుంటున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story