YSRCP Office : తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత..వీడియో

YSRCP Office : తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కార్యాలయాన్ని కూల్చివేశారు. శనివారం తెల్లవారు జామున బుల్‌డోజర్లతో నిర్మాణంలో ఉన్న భవనాన్ని నేలమట్టం చేశారు. టీడీపీ ప్రతికార రాజకీయాలకు పాల్పడుతుందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Dhivi
Updated on: 22 Jun 2024 11:29 AM IST
YSRCP Office : తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత..వీడియో
X

YSRCP Office : తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత..వీడియో

YSRCP Office : ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేశారు. శనివారం తెల్లవారుజామున బుల్‌డోజర్లతో నిర్మాణంలో ఉన్న ఆ భవనాన్ని నేలమట్టం చేశారు. టీడీపీ ప్రతీకార రాజకీయాలకు పాల్పడుతున్నట్లు వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పార్టీ ఆఫీసు నిర్మాణం విషయంలో హైకోర్టును ఆశ్రయించినా..స్థానిక ప్రభుత్వ అక్రమంగా కూల్చివేతకు పాల్పడుతున్నట్లు వైఎస్సార్ సీపీ నేతలు అంటున్నారు. కూల్చివేతను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసినా..సీఆర్డీఏ అధికారులు మాత్రం ఆగమేఘాల మీద ఆ కట్టడాన్ని కూల్చివేశారు.

కాగా బుల్‌డోజర్లతో సాయంతో కేవలం 2 గంటల వ్యవధిలోనే పార్టీ ఆఫీసును ధ్వంసం చేశారు. తెల్లవారకముందే సీఆర్డీఏ ఆదేశాలను మున్సిపల్ ఆధికారులు అమలు చేశారు. గేట్లు మూసేసి మరీ పోలీసుల మోహరింపు మధ్య కూల్చివేశారు. సీఆర్డీయే అధికారులపై కోర్టును ఆశ్రయించినా..అవేమీ పట్టించుకోకుండా నోటీసులివ్వకుండా నిర్మాణాన్ని సీఆర్డీఏ కూల్చివేసింది. చంద్రబాబు నివాసం నుంచి టీడీపీ ఆఫీసుకు వెళ్లే మార్గంలోనే వైసీపీ పార్టీ కార్యాలయాన్ని నిర్మిస్తున్నారు. కోర్టు ఆదేశాలను సీఆర్డీఏ ధిక్కరించిందని దీనిపై కోర్టుకు వెళ్లే యోచనలో వైసీపీ నేతలు ఉన్నట్లు సమాచారం. కూల్చివేతకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


Dhivi

Dhivi

Next Story