Guntur: ఇప్పటంలో మళ్లీ మొదలైన కూల్చివేతలు.. భారీగా మోహరించిన పోలీసులు..

Guntur: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Arun Chilukuri
Published on: 4 March 2023 10:53 AM IST
Demolition of Houses in Ippatam
X

Guntur: ఇప్పటంలో మళ్లీ మొదలైన కూల్చివేతలు.. భారీగా మోహరించిన పోలీసులు..

Guntur: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామంలో అధికారులు ఇళ్లను కూల్చేస్తున్నారు. జేసీబీలతో 8 కట్టడాల కూల్చివేతలను చేపట్టారు. గ్రామంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. ఇళ్లను కూల్చి వేస్తుండటంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. రోడ్డు విస్తరణ పేరుతో గతంలోనే ఇళ్ల కూల్చివేతలను అధికారులు చేపట్టారు. అప్పట్లో ఈ అంశం వివాదాస్పదం అయింది. దాంతో, అప్పట్లో కూల్చివేతలను ఆపేశారు. అప్పుడు మళ్లీ కూల్చివేతల తర్వాత మిగిలినపోయిన మరో ఎనిమిది ఇళ్లను కూల్చేస్తున్నారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పొలాలకు వెళ్లిన సమయంలో ఇంటి ప్రహరీ గోడలు కూల్చివేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story