Tirupati: తిరుపతి జిల్లా వెంకటగిరి వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు

Tirupati: వైసీపీ అభ్యర్థిని మార్చాలని డిమాండ్

Shashank Gullapelli
Published on: 25 March 2024 9:42 PM IST
Demand To Change YCP Candidate In Venkatagiri
X

Tirupati: తిరుపతి జిల్లా వెంకటగిరి వైసీపీలో తారాస్థాయికి వర్గపోరు

Tirupati: తిరుపతి జిల్లా వెంకటగిరి వైసీపీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది. వైసీపీ అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డికి టికెట్ కేటాయింపుపై సొంతపార్టీలో అసంతృప్తి చెలరేగింది. వైసీపీ బహిష్కృత నేత కలిమిలితో, వెంకటగిరి రాజకీయాల్లోకి మెట్టుకూరు ధనుంజయరెడ్డి వచ్చారు. సేవ్ వెంకటగిరి జగనన్న పేరుతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సమన్వయ కర్త అంటే అందరిని కలుపుకుని పనిచేయాలని వైసీపీ అభ్యర్థికి ధనుంజయరెడ్డి సూచించారు. ప్రెస్‌మీట్‌లు పెట్టి వ్యంగంగా మాట్లాడటం తప్ప ఎప్పుడైనా సమన్వయంతో పనిచేశావా అంటూ ధనుంజయరెడ్డి వైసీపీ అభ్యర్థిని ప్రశ్నించారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story