కారులో మృతదేహం కేసులో పురోగతి.. హత్యలో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి హస్తం..?

Vijayawada: విజయవాడ వ్యాపారవేత్త రాహుల్ ది హత్యేనని తేలింది.

Arun Chilukuri
Published on: 19 Aug 2021 8:16 PM IST
Dead Body Found in a Car at Vijayawada
X

కారులో మృతదేహం కేసులో పురోగతి.. హత్యలో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి హస్తం..?

Vijayawada: విజయవాడ వ్యాపారవేత్త రాహుల్ ది హత్యేనని తేలింది. జక్సిన్ కంపెనీ ఓనర్ అయిన రాహుల్ ను ఆర్థిక వివాదాలతోనే హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. హత్యలో ముగ్గురు వ్యక్తులు పాల్గొన్నట్లు వారిలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఒక ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి హస్తం ఉన్నట్టు క్లూస్ టీం గుర్తించింది.

వ్యాపార లావాదేవీల విషయమై గతరాత్రి దాదాపు మూడు గంటల పాటు వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది. వాదన ముదరడంతోనే దిండు, తాడుతో హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్యానంతరం డెడ్ బాడీని కారులోనే ఉంచి బయట నుంచి లాక్ వేసినట్టు తెలుస్తోంది. నిందితులను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story