Indrakeeladri Dasara Navaratri: ఇంద్రకీలాద్రిపై ఇవాళ్టి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

Dasara Sharan Navaratri Celebrations From Today On Indrakiladri
x

Indrakeeladri Dasara Navaratri: ఇంద్రకీలాద్రిపై ఇవాళ్టి నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు

Highlights

Indrakeeladri Dasara Navaratri: కమాండ్ర కంట్రోల్ రూమ్ ద్వారా క్యూలైన్ల మానిటరింగ్

Indrakeeladri Dasara Navaratri: అమ్మలగన్న అమ్మ దుర్గమ్మ కొలువైన ఇంద్రకీలాద్రి దసరా శరన్నవరాత్రి వేడుకలకు సిద్ధమైంది. కనకదుర్గమ్మ ఆలయంలో ఇవాళ్టి నుంచి దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు ప్రారంభంకానున్నాయి. ఈ నెల 23 వరకు దసరా‌ మహోత్సవాలు జరుగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు పది అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. నేడు తొలిరోజు శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనమిస్తారు. తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారి స్నపనాభిషేకం, అలంకరణ నిర్వహించారు. ప్రత్యేక పూజల అనంతరం ఉదయం తొమ్మిది గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతి ఇవ్వనున్నారు.

ఇవాళ అమ్మవారు శ్రీబాలత్రిపుర సుందరీ దేవి అవతారంతో భక్తులకు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 16న శ్రీ గాయత్రీ దేవి, అక్టోబర్ 17న అన్నపూర్ణాదేవి, అక్టోబర్ 18న శ్రీ మహాలక్ష్మి దేవి, అక్టోబర్ 19న శ్రీ మహాచండీ దేవి, అక్టోబర్ 20న మూలానక్షత్రం రోజున సరస్వతీ దేవిగా, అక్టోబర్ 21న శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా, అక్టోబర్ 22న శ్రీ దుర్గాదేవిగా అక్టోబర్ 23 విజయదశమి రోజున రెండు అలంకారాలలో దుర్గమ్మ దర్శనమివ్వనున్నారు. ఉదయం శ్రీమహిషా సురమర్ధనీ దేవిగా దర్శనమివ్వనున్న అమ్మవారు.. మధ్యాహ్నం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలలో దర్శనమిస్తారు.

అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో శ్రీదుర్గామల్లేశ్వర స్వామి వార్ల తెప్పోత్సవం జరుగనుంది. దసరా ఉత్సవాలకు 8 లక్షల మంది పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వినాయకుడి ఆలయం నుంచి దుర్గమ్మ సన్నిధానం వరకు నాలుగు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా అంతరాలయ దర్శనం నిలిపివేయనున్నారు. 5 వేల మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూం ద్వారా క్యూలైన్ల మానిటరింగ్ చేయనున్నారు. వృద్ధులకు, వికలాంగులకు బ్యాటరీ కార్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఘాట్లలో పుణ్య స్నానాలకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories