AP News: డేంజర్ బెల్స్ మోగిస్తున్న సర్కారీ స్కూళ్లు.. ఎప్పుడు కుప్పకూలుతాయో...

AP News: పైకప్పు పెచ్చులూడి కూలుతున్న స్కూలు భవనాలు...

Shireesha
Published on: 28 April 2022 2:29 PM IST
Danger Bells to Government Schools in AP | Live News Today
X

AP News: డేంజర్ బెల్స్ మోగిస్తున్న సర్కారీ స్కూళ్లు.. ఎప్పుడు కుప్పకూలుతాయో...

AP News: ఏపీలో కొన్ని ప్రభుత్వ పాఠశాలలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. శిథిలాస్థకు చేరిన స్కూళ్లు..ఎప్పుడు ఏ క్షణంలో కుప్పకూలుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. పెచ్చులూడిన స్లాబులు, గోడలు కూలుతూ విద్యార్థుల పాలిట యమపాశంగా తయారయ్యాయి. కర్నూలు జిల్లా గోనెగండ్లలోని ఉర్దూ పాఠశాలలో పాఠాలు వింటున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు పెచ్చులూడింది.

దీంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఉపాధ్యాయులు. రెండో తరగతికి చెందిన సఫాన్, ఆరిఫ్ తలలకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స చేశారు. జరిగిన ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కూలిపోయే బిల్డింగుల్లో పాఠాలు చెప్తూ తమ పిల్లల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని మండిపడ్డారు.

Shireesha

Shireesha

Next Story