Corona Cases in Andhra Pradesh: ఏపీలో కరోనా విశ్వరూపం

Corona Cases in Andhra Pradesh: రోజూ 20వేలకు చేరువలో కేసులు * ఏపీలోని ఏడు జిల్లాలు భారీగా పాజిటివ్ కేసులు

Sandeep Eggoju
Published on: 6 May 2021 12:07 PM IST
Daily Corona Cases in Andhra Pradesh Increasing Rapidly
X

కరోనా వైరస్: (representational image)

Corona Cases in Andhra Pradesh: ఏపీలో కరోనా వైరస్‌ విలయతాండవం చేస్తోంది. రాష్ట్రంలో రోజువారీ పాజిటివ్‌ కేసులు 20వేలకు చేరువలో నమోదవుతున్నాయి. అంతేకాదు.. దేశవ్యాప్తంగా గత రెండు వారాల వ్యవధిలో అత్యధిక వేగంగా కరోనా విస్తరిస్తున్న 30 జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఏడు జిల్లాలు ఉన్నాయి. ఇక అత్యధిక యాక్టివ్‌ కేసులున్న రాష్ట్రాల జాబితాలో ఏపీ ఆరవ స్థానంలో ఉన్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇక 20శాతానికిపైగా పాజిటివిటీ రేటు నమోదైన 16 రాష్ట్రాల్లో ఏపీ 13వ స్థానంలో ఉంది. మొత్తం 24 రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరుగుదల అధికంగా ఉండగా.., అందులో ఏపీ 4వ స్థానంలో నిలిచింది.

ఏపీలోని చిత్తూరు 11, శ్రీకాకుళం 16, తూర్పుగోదావరి 17, గుంటూరు 19, విశాఖ 27, అనంతపురం 29, కర్నూలు 30వ స్థానంలో ఉన్నాయి. ఈ జాబితాలో 10 జిల్లాలతో కేరళ ప్రథమస్థానాన్ని ఆక్రమించగా.. 7 జిల్లాలతో ఏపీ రెండవ స్థానంలో ఉంది.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story